విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టర్ 9లోని క్వార్టర్ నెంబర్ 201లో ఈ ఘటన జరిగింది. ఇంట్లోని మహిళ వంటగదిలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఏదో కదులుతున్నట్లు గమనించి దగ్గరకు వెళ్లి చూసింది. అక్కడ భారీ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించడంతో, ఆమె వెంటనే బయటకు వచ్చి తలుపులు వేసింది.

కుటుంబ సభ్యులు వెంటనే పాములను పట్టుకునే వ్యక్తి (స్నేక్ క్యాచర్) కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని వంటగదిలోని ఫ్రిడ్జ్ వెనుక ఉన్న పామును గమనించారు. కిరణ్ కుమార్ ఫ్రిడ్జ్‌ను పక్కకు జరపగా, ఆ పాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది.

కిరణ్ కుమార్ చాకచక్యంగా ఆ పామును పట్టుకుని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నాగుల పంచమి రోజున పాము కనిపించడంతో, ఇది దేవుడి మహిమ అని భావించి కుటుంబ సభ్యులు దానికి దండం పెట్టుకున్నారు.