క్షీరాబ్ధి ద్వాదశి
Ksheerabdi Dwadashi · చిలుకు ద్వాదశి · తులసీ కల్యాణం · Tulasi Kalyanam
21
128
రోజులు మిగిలి ఉన్నాయి
యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణుమూర్తికి, తులసీదేవికి కల్యాణం జరిపించే రోజు. తులసి కోట వద్ద దీపాలు వెలిగించి ఉసిరి కొమ్మతో పూజిస్తారు.
పండుగ ప్రాముఖ్యత
క్షీరసాగర మథనం జరిగిన రోజుగా క్షీరాబ్ధి ద్వాదశి ప్రసిద్ధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు వెళ్లిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొంటాడు — మరుసటి రోజు తులసీ కల్యాణం. ఈరోజు తులసి పూజ చేస్తే ఇంట లక్ష్మీకటాక్షం ఉంటుందని విశ్వాసం.
ఆచారాలు & పూజ విధానం
- తులసి కోట అలంకరణ — ఉసిరి కొమ్మ, చెరకు గడలతో
- తులసీ-దామోదర కల్యాణం
- తులసి కోట చుట్టూ దీపాలు — ఇంటిల్లిపాదీ దీపారాధన
- ఉసిరి కాయ దానం
ప్రత్యేక వంటకాలు
చలిమిడివడపప్పుపానకంఉసిరి పచ్చడి
శుభాకాంక్షలు
క్షీరాబ్ధి ద్వాదశి శుభాకాంక్షలు! తులసీ దామోదరుల అనుగ్రహం మీ ఇంట నిండాలి. 🪔🌿
జరుపుకునే ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్తెలంగాణ