శనివారం నాడు ధర్మసాగర్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు ప్రతాప్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద కేక్‌ను కట్ చేసి, బాణాసంచా కాల్చి, పండ్లను పంపిణీ చేశారు.

దీంతో, మండలంలోని కరుణాపురంలోని మానసిక వికలాంగుల ఆశ్రమానికి కూడా పండ్లను చేరవేసారు. ప్రజలకు మరింత సేవ చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా కోరారు.

బీఆర్ఎస్ మండల నాయకులు లాల్ మహ్మద్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ జుభేదా, మెరుగు రాజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.