తెలుగు సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’లో మీనా పాత్రతో గుర్తింపు పొందిన నటి అమూల్య గౌడ, తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, తన ప్రియుడు నిరంజన్ బి.ఎస్ (Niranjan B.S.)ను అభిమానులకు పరిచయం చేశారు.
కన్నడలో ప్రసారమైన ‘కమలి’ సీరియల్ షూటింగ్ సమయంలో అమూల్య, నిరంజన్ మధ్య స్నేహం మొదలైంది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించగా, వీరి పరిచయం ఇరు కుటుంబాలకు కూడా తెలిసినట్లు సమాచారం.
నిరంజన్ బి.ఎస్ కన్నడలో పలు సీరియల్స్‌లో నటించడమే కాకుండా, తెలుగులో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ఈ జోడీ కలిసి కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా అమూల్య సోషల్ మీడియాలో పంచుకున్నారు.







