భవానిపురంలోని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వారు స్వయంగా స్వీకరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం వంటి సమస్యలను బాధితుల నుంచి నేతలు ఓపికగా విన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను బుద్ధా వెంకన్న ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా 54వ డివిజన్, వించి పేటకు చెందిన 51 ఏళ్ల కమల్ ఖాన్ తన అనారోగ్య సమస్యపై వినతిపత్రం సమర్పించారు. హృద్రోగంతో బాధపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం కోసం రూ. 6 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను బుద్ధా వెంకన్న అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గుర్రం కొండ, కామ దేవరాజ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, తిరుపతి అనూష, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వీకరించిన అన్ని అర్జీలపై తదుపరి చర్యలు తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు.







