వేసవిలో నడుం నొప్పితో పాటు మూత్రం పోసేటప్పుడు మంట, రక్తం కనిపిస్తే కిడ్నీ రాళ్ల సంకేతాలు. ఇది సాధారణ సమస్య కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం, తగిన నీరు తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి కిడ్నీలో ఖనిజాలు గట్టిపడతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

కిడ్నీ రాళ్ల నివారణకు రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. ఉప్పు, ప్యాకెట్ స్నాక్స్ తగ్గించాలి. వైద్యుల సలహాతో మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాలి.

తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం, వాంతులు, మూత్రం తగ్గిపోవడం ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ముందస్తు చికిత్సతో రాళ్ల ప్రభావాన్ని నియంత్రించవచ్చు.