కికు యనమల, కశిష్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి. ఈ సినిమాకు శుభ సాయివెంకట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దీప్తి నడిమింటి నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకుంది. ఇ‍ప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్‌ సందర్భంగా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు నిర్మాత దీప్తి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఓ షాకింగ్ విషయాన్ని పంచుకుంది. ఈ మూవీకి హీరోయిన్ తనను చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపింది. ఆమెకు డబ్బులు ఇస్తే కానీ క్యారవాన్ దిగనని చెప్పేదని వెల్లడించింది. చిన్న చిన్న డిమాండ్స్‌ పూర్తి చేయకుంటే తాను షూట్‌కు రానని చెప్పేదని నిర్మాత పేర్కొంది.

అయితే పేమేంట్ విషయంలో మాకు కొన్నిసార్లు ఇబ్బందులొచ్చాయని దీప్తి వెల్లడించింది. మా బడ్జెట్‌ ఓవర్‌షూట్ కావడంతో లాస్ట్ షెడ్యూల్‌లో ఇబ్బంది పడ్డామని తెలిపింది. అలాంటి టైమ్‌లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది. ‍అగ్రిమెంట్‌ ప్రకారం ఆమెకు ప్రమోషన్స్‌ అయిపోయాక కేవలం రూ.లక్ష నాలుగు వేలు చెల్లించాలని నిర్మాత తెలిపింది. తాను మా ప్రమోషన్‌కు ఈవెంట్‌కు రాలేదు.. అందుకే ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలనుకోవడం లేదని నిర్మాత దీప్తి స్పష్టం చేసింది. ఈ డబ్బులు తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు డొనేట్ చేస్తున్నానని నిర్మాత దీప్తి ప్రెస్‌ మీట్‌లోనే ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వివా రాఘవ, రాజీవ్ రవిచంద్ర, శ్రీరామ్ వెంకట్, రామ్ జగన్ కీలక పాత్రల్లో నటించారు.