హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ సంవత్సరం ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం తెలిపారు. గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో జరిగిన సమన్వయ సమావేశంలో, హిందూ-ముస్లిం సమాజాల మధ్య సహకారాన్ని ప్రశంసిస్తూ 'ఇది దేశానికి గొప్ప సందేశం' అని ఆమె పేర్కొన్నారు.

ఈ ఉత్సవ నిర్వహణలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఉత్సవ పోస్టర్ మరియు బ్రోచర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ ఉత్సవ కాలంలో లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసిన మంత్రి, 'ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి' అని స్పష్టం చేశారు.