ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో మొరాకో జట్టు 2-0 తేడాతో ఓటమిపాలవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తీవ్ర నిరాశకు దారితీసింది.
మొరాకో మూలాలున్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించేందుకు వెళ్లారు. కానీ మొరాకో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫ్రాన్స్ విజయం సాధించడంతో గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
మ్యాచ్ ముగిసిన వెంటనే నోరా స్టేడియం లోపలి నుంచి భావోద్వేగపూరిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. మొరాకో ఓటమి తర్వాత స్టేడియంలోని అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. మొరాకో ప్లేయర్స్ చూపించిన పట్టుదలను ఆమె ఎంతో అభినందించారు.
మొరాకో ఈ టోర్నీలో చూపించిన చారిత్రాత్మక ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల మనసులను గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికపై తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఓటమి ఉన్నప్పటికీ, వారి పోరాట పటిమకు నోరా సహా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సపోర్ట్ చేశారు.








