నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ చెస్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యార్థులకు చెస్ క్రీడపై ఆసక్తిని కలిగించడం, వారిలో వ్యూహాత్మక ఆలోచనలు మరియు క్రమశిక్షణను పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ప్రదర్శనలో ఎఫ్ఐడీఈ (FIDE) రేటింగ్ కలిగిన క్రీడాకారుడు మనోజ్ కుమార్ విట్టపు పాల్గొన్నారు. ఆయన 10 మంది విద్యార్థులతో ఏకకాలంలో చెస్ మ్యాచ్ ఆడారు.
చెస్ ఆడటం వల్ల విద్యార్థులు విద్యా విషయాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తారని, క్రమశిక్షణ అలవడుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.








