సన్నగా ఉండటం అనేది సమస్య కాదు, సరైన దుస్తులను ఎంచుకోకపోవడమే అసలైన సమస్య. సన్నగా ఉన్న అబ్బాయిలు తమ లుక్‌ను మెరుగుపరుచుకోవడానికి లేయరింగ్ పద్ధతిని పాటించడం ఉత్తమం. తెల్లటి లేదా సాలిడ్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకుని, బటన్లు పెట్టకుండా ఓపెన్‌గా ఉంచితే లుక్‌లో డెప్త్ పెరుగుతుంది. చలికాలంలో అయితే హుడీపై డెనిమ్ జాకెట్ లేదా ఓవర్‌షర్ట్ వేసుకోవడం వల్ల బాడీ ఆకృతి కాస్త బల్కీగా కనిపిస్తుంది.
దుస్తుల ఎంపికలో స్కిన్నీ జీన్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇవి కాళ్లను మరింత సన్నగా చూపిస్తాయి కాబట్టి, వాటికి బదులుగా స్ట్రెయిట్ ఫిట్ జీన్స్, రిలాక్స్‌డ్ ఫిట్ ప్యాంట్స్, చినోస్ లేదా కార్గోస్ ఎంచుకోవాలి. ఇవి శరీరానికి సరైన బ్యాలెన్స్‌ను ఇస్తాయి. ప్రతి ట్రెండ్ అందరికీ సెట్ కాదని, మనకు సరిపోయే దుస్తులనే ఎంచుకోవాలని గుర్తుంచుకోవాలి.
చివరగా, యాక్సెసరీస్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సన్నటి చైన్లు, చిన్న రింగులు, చిన్న డయల్ వాచ్‌లు వాడటం వల్ల సన్నని లుక్ మరింత హైలైట్ అవుతుంది. దీనికి బదులుగా పెద్ద డయల్ ఉన్న వాచ్, బోల్డ్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్, మందంగా ఉండే బ్రేస్‌లెట్ లేదా చైన్ ఎంచుకోవడం ద్వారా లుక్‌కు వెయిట్ వస్తుంది. బాడీని మార్చుకోవడానికి నెలల సమయం పట్టినప్పటికీ, దుస్తుల ఎంపిక ద్వారా కేవలం మూడు నిమిషాల్లోనే స్టయిలిష్‌గా మారవచ్చు.








