ఉదయం కళ్ళు తెరిచేసే సమయంలో అలసట, శక్తిలేమి అనుభవిస్తున్నారని. ఈ లక్షణాలను చాలా మంది సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావిస్తున్నప్పటికీ, ఇది శరీరంలో విటమిన్లు మరియు ఖనిజాల లోపానికి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆహారంలో తగినంత పోషకాలు లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి ఈ లోపాలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు B12 మరియు D విటమిన్ లోపాలతో ఎక్కువగా బాధపడుతున్నారు.

చర్మం పాలిపోవడం, గోర్లు బలహీనంగా మారడం, పెదవులు పగిలిపోవడం వంటి లక్షణాలు కూడా ఈ లోపాలకు స్పష్టమైన సంకేతాలు. ఈ సమస్యలను గుర్తించడానికి సాధారణ రక్త పరీక్షలు సరిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుని, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

వైద్యులు సూచించిన విటమిన్ సప్లిమెంట్లను ఉపయోగించడం ద్వారా లోపాలను తగ్గించవచ్చు. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.