సోషల్ మీడియాలో ప్రభుత్వం, కూటమి నేతలను లక్ష్యంగా చేసుకున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలను ఎదుర్కోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పవర్ జులై 10న జరిగిన కేబినెట్ సభలో సోషల్ మీడియా వేదికపై అసభ్యమైన పోస్టుల ప్రభావాన్ని వివరిస్తూ ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇచ్చారు.

అభ్యంతరకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. వికృతానందం పొందే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యవహారాలపై హెచ్చరిక జారీ చేశారు. మంత్రులు, నేతలు తొందరపడి స్పందించకుండా చట్టపరమైన చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.