హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ శమిర్పేట్లో 61వ పబ్లిక్ EV చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ స్టేషన్ 240kW అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో EV యూజర్‌లకు హై-స్పీడ్ ఛార్జింగ్ సౌకర్యాలను అందిస్తుంది.

ఇది తెలంగాణలో హ్యుందాయ్ నాల్గవ EV చార్జింగ్ ఫెసిలిటీ. దేశవ్యాప్తంగా హ్యుందాయ్ EV చార్జింగ్ నెట్‌వర్క్ ఇప్పుడు 183 స్టేషన్లతో పనిచేస్తోంది. ఈ చార్జింగ్ స్టేషన్ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటుంది.

240kW అల్ట్రా-ఫాస్ట్ చార్జర్ EV యూజర్‌ల ఛార్జింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది హ్యుందాయ్ EV యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచే ప్రయత్నంలో భాగం.