ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల కోసం సంస్థ కొత్తగా వాట్సప్ ఫిర్యాదు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 8330911912 అనే నెంబర్‌ను కేటాయించింది. ఈ సేవలు రోజుకు 24 గంటల పాటు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

వినియోగదారులు ముందుగా ఈ నెంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్ ద్వారా విద్యుత్ సమస్యలకు సంబంధించిన ఫొటోలను పంపి ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా కూలుతున్న విద్యుత్ స్తంభాలు, కింద పడిపోయిన తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు లేదా విద్యుత్ చోరీ వంటి అంశాలపై వినియోగదారులు ఫిర్యాదులు పంపవచ్చు. అధికారులు ఈ మెస్సేజ్‌లకు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు.

వాట్సప్ సేవలతో పాటు, గతంలోనే అందుబాటులోకి తెచ్చిన 1912 కాల్ సెంటర్ సేవలు కూడా కొనసాగుతాయి. 8 జిల్లాల పరిధిలోని వినియోగదారులు ల్యాండ్ లైన్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా 1912 నెంబర్‌కు కాల్ చేసి తమ పేరు, కనెక్షన్ నెంబర్ వివరాలను తెలియజేయడం ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.