జమైకా దేశానికి చెందిన లోరెన్జో థామ్సన్‌ను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్‌వెస్ట్‌వెయిర్‌లైన్స్ సంస్థలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న ఇతనిపై వీసా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి.

టెనెసీ రాష్ట్రంలోని నాసిల్ నగరంలో జూలై 14న ఈ అరెస్ట్ జరిగింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండటంతో అధికారులు ఇతనిని అదుపులోకి తీసుకున్నారు.

అధికారిక రికార్డుల ప్రకారం, లోరెన్జో థామ్సన్ 2021 ఏప్రిల్ 17న అమెరికాలో ప్రవేశించారు. అదే ఏడాది అక్టోబర్ 16తో ఆయన వీసా గడువు ముగిసింది.

ప్రస్తుతం లోరెన్జో థామ్సన్ అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్ర కారాగారంలో ఉన్నారు.