లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఒక యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానెల్ పేరుతో తనను ఒక ప్లాట్‌కు పిలిపించి రేగా కాంతారావు వేధించారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా, తన ప్రైవేటు ఫొటోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని కాంతారావు మోసం చేశారని బాధితురాలు తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.