గాజాలో జరుగుతున్న దాడులు, హత్యలకు ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహు బాధ్యుడని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నెటన్యాహు లండన్‌లో పర్యటిస్తే, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సాదిక్ ఖాన్ కోరారు.

నవంబర్ 2024లో అంతర్జాతీయ క్రైమ్ కోర్టు (International Criminal Court) ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహుతో పాటు, ఆ దేశ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ అంతర్జాతీయ వారెంట్ నేపథ్యంలోనే సాదిక్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ నెటన్యాహు లండన్‌కు వస్తే, బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని సాదిక్ ఖాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ కోర్టు జారీ చేసిన వారెంట్ ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.