శనివారం (జులై 18) కవి అందెశ్రీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఘట్‌కేసర్‌లో ఆయన స్మృతి వనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దరన్నను ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి అవమానించిందని ఆరోపించారు. గద్దర్ వంటి ప్రజాకవులను అవమానించిన రోజే ప్రజలు దొరల గడీలను బద్ధలు కొట్టాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

అందెశ్రీ, గద్దరన్నలతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజాకవుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.