విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో కూతురిగా, తర్వాత ప్రేయసిగా కనిపించిన ఏకైక హీరోయిన్ దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. వెంకటేశ్ సరసన ఎంతో మంది తారలు నటించినా, ఈ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించిన ఘనత శ్రీదేవికే దక్కింది. అప్పట్లో ఆమె అందం, అభినయంతో సౌత్ కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా నిలిచారు.
వెంకటేశ్ బాలనటుడిగా 1972లో తెలుగులో విడుదలైన 'ప్రేమ్ నగర్' (తమిళంలో 'వసంత మాళిగై') చిత్రంలో తొలిసారి కనిపించారు. ఈ సినిమాలో శివాజీ గణేషన్ కూతురిగా శ్రీదేవి నటించగా, విజయ్ చిన్ననాటి పాత్రలో వెంకటేశ్ కనిపించారు. దీంతో వెంకటేశ్ పాత్ర పరంగా శ్రీదేవికి బాబాయ్‌గా నటించినట్లయింది.
చాలా కాలం తర్వాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'క్షణక్షణం' (1991) చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ థ్రిల్లర్ డ్రామాలో వెంకటేశ్, శ్రీదేవి కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. కూతురిగా, తర్వాత ప్రేయసిగా కనిపించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి కావడం వెంకటేశ్ కెరీర్‌లో ప్రత్యేకమైన అంశం.
ప్రస్తుతం వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు.







