నటి రష్మిక మందన్నా షూటింగ్‌లో పాల్గొంటుండగా గాయపడ్డారు. మైసా, రణబాలి చిత్రాల కోసం యాక్షన్ మరియు నృత్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు ఈ గాయమైంది.
వైద్య పరీక్షల్లో ఆమెకు 'టోటల్ హిప్ టిండాన్ డిటాచ్‌మెంట్' (తుంటి కండరాల సంబంధిత గాయం) అయినట్లు గుర్తించారు. సాధారణంగా అథ్లెట్లలో మాత్రమే కనిపించే ఈ తరహా గాయం రష్మికకు కలగడం పట్ల వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గాయం తీవ్రత దృష్ట్యా రష్మికకు ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతితో పాటు రిహాబిలిటేషన్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆమె ప్రస్తుతం చేస్తున్న మైసా, రణబాలి షూటింగ్‌లకు కొన్ని వారాల పాటు దూరంగా ఉండనున్నారు.






