విజయ్ సల్గాన్కర్ పాత్రలో అజయ్ దేవగణ్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలో వచ్చిన రెండు భాగాలు పెద్ద విజయాన్ని అందుకోవడంతో, ఈ మూడో భాగంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఈ చిత్రంలో అజయ్ దేవగణ్‌తో పాటు టబు, శ్రియా శరన్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్, రజత్ కపూర్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్, కమలేష్ సావంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈసారి విజయ్ సల్గాన్కర్ పోలీసులకు చిక్కుతాడా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.








