సినిమా పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్ వంటి అంశాలు తరచూ వినిపిస్తుంటాయి. గతంలో 'బైసన్' సినిమా షూటింగ్ సమయంలో నటి అనుపమ పరమేశ్వరన్, తమిళ హీరో ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అయితే, ఇటీవల అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్‌లు ఈ బంధంపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఫొటోలు పోస్ట్ చేసినందుకు క్షమాపణలు చెబుతూ, ఇకపై ఎవరి అనుమతి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. తన జీవితం పూర్తిగా తనదేనని, ఒకప్పుడు కోల్పోయిన ప్రశాంతతను తిరిగి పొందుతున్నానని ఆమె రాసుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలతో అనుపమ, ధ్రువ్ విక్రమ్‌కు బ్రేకప్ చెప్పేశారా అనే చర్చ మొదలైంది. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే టాక్ వినిపించినప్పటికీ, దీనిపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.
కెరీర్ పరంగా చూస్తే, అనుపమ నటించిన 'మరీచిక', 'లాక్ డౌన్' సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన 'భోగి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.








