కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరిన నాయకులకు పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ఆర్గానిక్ కాంగ్రెస్ నాయకులను మాత్రం పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

పార్టీలో ఇప్పుడున్న పరిస్థితులపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమను తాము సైడ్‌లైన్ చేసుకుంటున్నారని, పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.