కెజిఎఫ్ తర్వాత యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ సినిమా, అడల్ట్ కంటెంట్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ కథాంశమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన పాటల పట్ల వస్తున్న విమర్శల నేపథ్యంలో, నిర్మాత వెంకట్ కె నారాయణ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
జన నాయగన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ, 'టాక్సిక్' టైటిల్‌లోనే తాము సినిమా ఉద్దేశాన్ని స్పష్టం చేశామని తెలిపారు. ఇది కేవలం పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమా అని, ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తే ఆ విషయం సులభంగా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. సినిమా థీమ్ ఏమిటో ట్రైలర్‌లో పూర్తిగా చూపిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లు క్రియేటివిటీని, సినిమా స్థాయిని మరియు లేడీ పాత్రలను పరిచయం చేశాయి. మరోవైపు, యశ్ స్వయంగా ఈ సినిమా కథాంశం గురించి బాలీవుడ్ మీడియాతో పంచుకున్నారు. 1961 వరకు పోర్చుగీస్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో అధికారం కోసం జరిగే గ్యాంగ్‌స్టర్ కథ ఇది.
ఈ చిత్రంలో బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్, తండ్రి-కొడుకుల రివెంజ్ డ్రామాతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని యశ్ వివరించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జరిగిన వ్యాపార నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ఆయన తెలిపారు.








