కన్నడ నటి రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, 'కాంతార 1'తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' చిత్రంలో మెల్లిసా పాత్రలో ఆమె నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వరుస విజయాలతో మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో, ఆమె తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల జాబితాలో ఆమె చేరారు.
'టాక్సిక్' చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుటారియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఆగస్టు 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరోవైపు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఆమె కెరీర్‌లో దూసుకుపోతున్నారు.








