నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్రలో నటిస్తున్న సంపూర్ణేష్ బాబు, సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టారు.
నాని ఫస్ట్ లుక్ నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఆయన జడలు. ఈ జడల వెనుక ఉన్న కథ గురించి సంపూర్ణేష్ బాబు స్పందిస్తూ, నాని పాత్రకు ఆ జడలు ఎందుకున్నాయో చెప్పేందుకు సినిమాలో చాలా పెద్ద ట్విస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.
సినిమాలో పాత్రల నేపథ్యం, తిరుగుబాటుకు గల కారణాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషన్ ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తాయని ఆయన చెప్పారు. కేవలం మాస్ ఎలివేషన్లు మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే భావోద్వేగాలతో ఈ సినిమా రాబోతోంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి నటుడి నుంచి తాను అనుకున్న నటన వచ్చే వరకు చాలా శ్రమించారని సంపూర్ణేష్ బాబు తెలిపారు. ప్రేక్షకులు ప్యారడైజ్ బిర్యానీ తిన్నప్పుడు ఎంత తృప్తి పొందుతారో, ఈ సినిమా చూశాక అంతకు రెట్టింపు సంతోషంగా థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఈ సినిమా పీరియడ్ డ్రామానా లేక తెలంగాణ పల్లెటూరి కథా అనే విషయంపై స్పష్టత రావాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే. నాని లుక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో అప్పుడే తెలుస్తుంది.








