Xiaomi స్మార్ట్ బ్యాండ్ 11 మోడల్ 1.72-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండి, 2mm సన్నని బెజెల్స్‌తో రూపొందించబడింది. కేవలం 9.99mm మందం, 15.58 గ్రాముల బరువుతో ఉండే ఈ బ్యాండ్, మెటల్ మరియు సిరామిక్ వంటి వివిధ రకాల స్ట్రాప్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ బ్యాండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుంది. ఇందులో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లతో పాటు, HRV మానిటరింగ్ మరియు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్లీప్ సైక్లింగ్ ట్రాకింగ్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లు ఉన్నాయి. వివిధ రకాల ఇండోర్, అవుట్‌డోర్ యాక్టివిటీలను ట్రాక్ చేయడానికి ఇది 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.
సాంకేతిక పరంగా, ఈ బ్యాండ్ Xiaomi సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన HyperOS 4పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ కంట్రోల్స్, కస్టమైజ్ చేసుకునే వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అలాగే, 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటంతో నీటిలో కూడా ఇది పాడవదు.
చైనాలో ఈ స్మార్ట్ బ్యాండ్ 11 ధర 289 యువాన్లు, అంటే సుమారు రూ. 4,065గా ఉంది. NFC (కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు, స్మార్ట్ యాక్సెస్ కార్డుల కోసం ఉపయోగపడే సాంకేతికత) వెర్షన్ ధర 339 యువాన్లు, అంటే సుమారు రూ. 4,768గా నిర్ణయించారు. సెరామిక్ మరియు మెటల్ ఎడిషన్ల ధర 399 యువాన్లు, అంటే సుమారు రూ. 5,612గా ఉంది.
ప్రస్తుతానికి ఈ బ్యాండ్ చైనాలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.







