సైబర్ ఫ్రాడ్ కేసులను సాధారణ నేరాల్లా చూడకూడదని, వీటిని అత్యంత తీవ్రమైనవిగా పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తరహా నేరాల పట్ల దర్యాప్తు సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది.

కేసుల విలీనం లేదా క్లబ్ చేయడంపై కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. కేవలం నిందితులు ఉపయోగించిన బ్యాంకు ఖాతా పేరు ఒకటేనన్న కారణంతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించకూడదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను ఏ విధంగా క్లబ్ చేయాలనే అంశంపై పరిశోధన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల మేరకు వ్యవహరించాలని కోర్టు సూచించింది.