పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే హిమాలయాల్లోని మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. ఈ దృశ్యం యాత్రికులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, యాత్రికుల శ్వాసక్రియ వల్ల కలిగే వేడి ప్రధాన కారణాలుగా అధికారులు మరియు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో త్రిశూల వేదిక మాత్రమే కనిపిస్తోంది.

ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన యాత్ర ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే 4 లక్షల మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మంచు లింగం కరిగిపోయినా, భక్తుల విశ్వాసం తగ్గలేదని శ్రైన్ బోర్డ్ తెలిపింది.