నాగార్జున నిర్మించిన 1998 సినిమా 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి' లో శివాజీకి లక్ష పాతిక వేల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ డబ్బులతో శివాజీ తన స్వస్థలంలో ఐదు ఎకరాల ముప్పై ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. 'ఈ సంఘటనను బిగ్ బాస్ షోలో కూడా చెప్పాను, నాకు ఎప్పటికీ మర్చిపోలేనిది' అని శివాజీ చెప్పారు.
నాగార్జునతో తన బంధం ఎప్పటినుంచో ఉందని, అన్నపూర్ణ స్టూడియోస్ లో తన కెరీర్ మొదలు పెట్టిందని శివాజీ వివరించారు. నాగార్జున నిర్మాణంలో చేసిన మొదటి సినిమాకే ఈ రెమ్యునరేషన్ ఇవ్వడం నాగార్జున మర్యాదకు నిదర్శనం.







