మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ వంటి సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా గుర్తింపు పొందిన నటి శిరీష, ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ అయిన మహేంద్రను రెండో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరి వివాహం ఆగస్టు 28న జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను శిరీష సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా శిరీష తన వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఆమె తన భర్త మహేంద్రతో పాటు తన కొడుకుతో కలిసి కనిపించారు.
శిరీషకు ఇదివరకే ఒక కొడుకు ఉన్నాడు. తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట, తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట కనిపిస్తున్నాయి.






