మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం (జూలై 27) వేడినీళ్ల కోసం బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్ పెట్టిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మల్లికార్జున్ నగర్ నివాసి బుడ్డికారి స్వాతి (40) తన ఇంట్లో వేడినీళ్ల కోసం బకెట్‌లో హీటర్ ఉంచింది. అయితే, అనుకోకుండా కాలు జారి పడటంతో బకెట్‌లో ఉన్న హీటర్ ఆమెపై పడింది. దీనివల్ల విద్యుత్ ఘాతానికి గురైన స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.






