హైదరాబాద్‌లోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్‌లో నివసిస్తున్న 29 ఏళ్ల రేగు మహేశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మహేశ్, శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తల్లిదండ్రులు, చెల్లి సొంతూరుకు వెళ్లిన సమయంలో మహేశ్ తన చెల్లికి ఒక మెసేజ్ పంపాడు. తాను అందరినీ మిస్ అవుతున్నానని అందులో పేర్కొనడంతో, అనుమానం వచ్చిన చెల్లి వెంటనే అతనికి ఫోన్ చేసింది. మహేశ్ స్పందించకపోవడంతో, ఆమె తన బంధువు గిరిబాబును ఇంటికి పంపింది.
గిరిబాబు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, మహేశ్ బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. గిరిబాబు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మహేశ్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








