ఒడిశా రాష్ట్రం నౌపాదా జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. బెంగళూరు వెళ్లేందుకు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు, తన రైల్వే టికెట్ కన్‌ఫర్మ్ కాకపోవడంతో టికెట్ కౌంటర్ వద్ద వేచి చూస్తోంది.

అదే సమయంలో రైల్వే శాఖలో పనిచేసే కపిలేశ్వర్ సింగ్ ఆమెను పలకరించాడు. టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి, ఆమెను స్టేషన్‌లోని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై కపిలేశ్వర్ అత్యాచారం చేశాడు.

నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.

బాధితురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు కపిలేశ్వర్ సింగ్‌ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.