మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ వేర్‌హౌస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాద స్థలం నుండి దట్టమైన పొగలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో పలు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు.

ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రస్తుతం స్థానిక యంత్రాంగం, పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.