పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దిల్లీ పోలీసులు విచారణ నోటీసులు జారీ చేశారు. 2013 నాటి క్రిమినల్ కేసుకు సంబంధించి ఆమెను సాక్షిగా విచారించాలని పోలీసులు కోరుతున్నారు.
సోమవారం దిల్లీ పోలీసులు, స్థానిక కాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఆమె అధికారిక నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. దక్షిణ కోల్‌కతాలోని 30బీ హరీశ్ చటర్జీ స్ట్రీట్ నివాసంలో సుభాశిశ్ చక్రవర్తి ఈ నోటీసును అందుకున్నారు.
సాక్షులను విచారణకు పిలిచే అధికారాలు కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద ఈ నోటీసు జారీ చేశారు. విచారణ అధికారులను కలిసేందుకు దిల్లీకి రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
2013 ఏప్రిల్‌లో దిల్లీలోని బంగా భవన్ బయట ఎస్ఎఫ్‌ఐ ఆందోళన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నాటి రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై ఆందోళనకారులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో 2013 ఏప్రిల్ 9న కేసు నమోదైంది. అమిత్ మిత్రాతో పాటు మమతా బెనర్జీ కూడా ఆ సమయంలో జాతీయ రాజధానిలో ఉన్నారని పోలీసులు తెలిపారు.







