స్నేహితుడి వద్ద తీసుకున్న డబ్బుతో షేక్ పేటలో ఒంటరిగా వెళ్తున్న గుంటి సత్యనారాయణను ఇద్దరు పోలీసు సిబ్బంది అడ్డగించారు. ఈనెల నాలుగో తేదీన తన అవసరాల కోసం సత్యనారాయణ మూడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన ఆ సిబ్బంది, అక్రమ డబ్బుగా కేసు నమోదు చేస్తామని బెదిరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డెబ్బై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పినా వారు వినలేదు. అతడి బ్యాగులో ఉన్న యాభై వేల రూపాయలను బలవంతంగా తీసుకున్నారు.
ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్. మల్సూర్ (34), హోంగార్డు మోహన్ గౌడ్ (39)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.







