బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఫౌజీ' సినిమా షూటింగ్ చేస్తుండగా విషప్రయోగం చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.

ఈ నేపథ్యంలోనే, రాజేష్ శర్మ పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో ద్వారా ఈ వార్తలను ఖండించారు. రాజేష్ శర్మకు ఏ విధమైన తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని, కేవలం షుగర్ వల్ల కాలు వాచి హాస్పిటల్‌లో చేర్చుకున్నారని వివరించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిస్చార్జ్ అవుతారని తెలిపారు.

సుభాశిష్ పాండా మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని, కొందరు స్వార్థం కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రజలను కోరారు.

ఇంతలో, రాజేష్ శర్మ తన పీఏతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా నిరూపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థించారు.