ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది మళ్లీ సందడి చేయనున్నారు. ఒక ప్రత్యేక ఎపిసోడ్ కోసం వీరు ముగ్గురు తిరిగి షోలోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

సుధీర్, గెటప్ శ్రీను తమదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు. సుధీర్, రష్మీ కలిసి కామెడీ చేశారు. వీరిద్దరి జోడీకి టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి గురించి కూడా వార్తలు వచ్చాయి.

షోలో సుధీర్‌ను చూడగానే రష్మీ భావోద్వేగానికి లోనైంది. తాము ఇద్దరం ఒకేసారి జబర్దస్త్ ప్రయాణాన్ని మొదలుపెట్టామని, సుధీర్ మధ్యలో వెళ్లిపోయాడని చెబుతూ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.

సుధీర్ గతంలో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి సినిమాలు, ఇతర ఛానల్స్‌లో షోలు చేసుకుంటున్నాడు. రష్మీ మాత్రం జబర్దస్త్ షోలో యాంకర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. జబర్దస్త్ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు, రచయితలు, దర్శకులు సెలబ్రిటీలుగా ఎదిగారు.

రష్మీ ఇంకా ఏమని మాట్లాడింది, సుధీర్ ఎలా స్పందించాడనే విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 6, ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.