హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉండగా అది అధిక వేడికి గురై మంటలు వచ్చాయని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు సాంకేతిక విచారణ మొదలుపెట్టారు. ల్యాప్‌టాప్‌లో లోపం ఉందా, ఛార్జర్ లేదా బ్యాటరీ వేడెక్కిందా లేక విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసేటప్పుడు గాలి ప్రసరణ ఉండే గట్టి ఉపరితలాలపైనే ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను బెడ్, దిండు లేదా దుప్పట్లపై ఉంచి ఛార్జింగ్ చేయడం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు.

దెబ్బతిన్న వైర్లు, నాసిరకం ఛార్జర్లను వాడకూడదని, బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలని నిపుణులు చెబుతున్నారు. పరికరాలను పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో వదిలేయకుండా జాగ్రత్తపడటం సురక్షితమని వారు సూచిస్తున్నారు.