బీబీఎల్ 2026లో భారతదేశం-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఒప్పందం క్రింద చెన్నైలో డిసెంబర్ 12న BBL తొలి మ్యాచ్ జరగనుంది. BCCI, TNCA ఆమోదంతో చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్లు పెర్త్ స్కాచర్స్ మరియు మెల్బోర్న్ రెనెగ్రేడ్స్ తలపడతారు.

క్రికెట్ ఆస్ట్రేలియా భారతదేశంలో BBL నిర్వహణకు ఆసక్తి చూపింది. ఇందుకు చెన్నైని ఎంపిక చేసి మే నెలలో తమ బృందాన్ని పంపి స్టేడియం పరిస్థితులు, ప్రేక్షకుల ఆదరణను పరిశీలించింది. BCCI అధ్యక్షుడు మిథున్ మిన్హస్ ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

BBL ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ, 'భారతదేశంలో BBL నిర్వహించడం ద్వారా లీగ్ గుర్తింపును పెంచాలని నిర్ణయించాం' అని తెలిపారు.