టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం 2026 డిసెంబర్ 4న లక్నోలో జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మచ్చలిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియా సరోజ్‌తో రింకూ వివాహానికి ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి.
ఈ వివాహ వేడుక లక్నోలోని రామాడా బై విండమ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 2025 జూన్‌లో జరిగిన వేడుకలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారు.
రింకూ సింగ్ తండ్రి 2026 ఫిబ్రవరిలో మరణించారు. ఈ వ్యక్తిగత విషాదం కారణంగానే పెళ్లికి ఇరు కుటుంబాలు సుదీర్ఘ సమయం తీసుకున్నాయి. ప్రస్తుతం రింకూ తన సొంతూరైన అలీగఢ్‌లో కుటుంబంతో గడుపుతూనే పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల చివరలో దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు రింకూ వెళ్లాల్సి ఉంది. ఆ లోపే పెళ్లి పనులన్నీ పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలీగఢ్ నుంచి సుమారు 100 మంది అతిథులు ఈ వివాహానికి హాజరవుతారని అంచనా.
వివాహానికి రాజకీయ నాయకులు, ప్రముఖులు, స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వ్యక్తిగతంగా కలవాలని రింకూ నిర్ణయించుకున్నారు. నవంబర్ 14 లేదా 15 తేదీల్లో తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.







