హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో విష్ (వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్) ప్రీ-స్కూల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ పాఠశాలను నటి, నిర్మాత మంచు లక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో సరదాగా సమయాన్ని గడిపారు.
ప్రతి చిన్నారిలో దాగి ఉన్న సహజ ప్రతిభను వెలికితీసేలా ఈ పాఠశాల విద్యా విధానాన్ని రూపొందించారు. సంప్రదాయ బోధనకు భిన్నంగా, పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస మరియు కరుణ వంటి విలువలను పెంపొందించేలా ఇక్కడ శిక్షణ ఉంటుందని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రతి బిడ్డ ప్రత్యేకతను గుర్తించి, అర్థవంతమైన అభ్యాస అనుభవాలను అందించే పాఠశాల లక్ష్యాన్ని ఆమె అభినందించారు.
ఈ ప్రీ-స్కూల్ స్కాండినేవియన్, జపాన్ విద్యా విధానాలు మరియు రెగ్గోగో ఎమీలియా వంటి ప్రపంచ ప్రసిద్ధ పద్ధతులను సమన్వయం చేస్తోంది. పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా, వారిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యత మరియు సహానుభూతిని పెంచడమే తమ ధ్యేయమని వ్యవస్థాపకురాలు దీప్తి చిట్కారా తెలిపారు. భద్రతతో కూడిన ఆనందదాయకమైన వాతావరణంలో పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించేలా క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.
ప్రతి చిన్నారి అభ్యాస ప్రయాణం అన్వేషణ మరియు ఆవిష్కరణలతో కూడిన అద్భుతమైన అనుభవంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సహ వ్యవస్థాపకుడు మనవ్ పురి తెలిపారు. పిల్లలను జీవితానికి సిద్ధం చేసేలా, వారు ఎవరో, ఏమి కాగలరో తెలుసుకునే అవకాశాన్ని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.








