వానాకాలంలో ప్రయాణించేటప్పుడు చర్మం జిడ్డుగా మారడం, దుమ్ము పేరుకోవడం, మొటిమలు తయారవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రతలో హఠాత్తు మార్పులు, అధిక తేమ వల్ల స్వేద రంధ్రాలు పూడుకుపోయి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

దీంతో ప్రయాణించేటప్పుడు ఫోమింగ్ జెల్ క్లెన్సర్లను తీసుకెళ్లాలి. డ్రై స్కిన్ ఉన్నవారు నాన్-ఫోమింగ్ క్లెన్సర్లు వాడాలి. సబ్బుతో మాత్రమే కడగడం చర్మ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. బయటికి వెళ్లిన తర్వాత మళ్లీ ఇంటికి చేరుకునే వరకు ముఖం కడగకపోతే చర్మ సమస్యలు తీవ్రమవుతాయి.

ఆక్నే ప్రోన్ స్కిన్ ఉన్నవారికి వీపు, భుజాలపై మొటిమలు కనిపిస్తాయి. ఇలాంటి చర్మానికి యాంటీ-బ్యాక్టీరియల్ క్లెన్సర్ జెల్ ఉపయోగించాలి. ప్రతిరోజూ రెండుసార్లు క్లెన్సింగ్ చేయడం, తేమను తీసివేయడం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.