ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సంకల్ప సమావేశంలో కొందరు కార్యకర్తలు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరుతో పదేపదే నినాదాలు చేశారు. ఈ అవాంతరానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసహనం ప్రదర్శించారు.

కార్యకర్తల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే, వారిని 'యూస్‌లెస్ ఫెలోస్' (పనికిమాలిన వెధవల్లారా) అని సంబోధించారు. దేశమంతా తమ చేతుల్లోకి వచ్చేసినట్లు వారు ప్రవర్తిస్తున్నారని మందలించారు.

ఈ పరిణామంతో ముఖ్యమంత్రి శివకుమార్‌తో పాటు మరికొందరు నాయకులు ఆ కార్యకర్తలను కూర్చోమని సముదాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది.