అస్సాం రాష్ట్రంలో వరదల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నాలుగు జిల్లాల్లోని 147 గ్రామాలు నీట మునిగిపోగా, 32 వేల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద ప్రభావిత జిల్లాల్లో నాగావ్ (Nagaon) అత్యంత దారుణంగా దెబ్బతింది. ఒక్క ఈ జిల్లాలోనే దాదాపు 20 వేల మంది ప్రజలు వరద బారిన పడ్డారు.
వరదల వల్ల 3,198.77 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో 15 సహాయక శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదివారం నాటికి ఐదు జిల్లాల్లో 52 వేల మంది వరదలకు గురికాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 32 వేలకు తగ్గడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది.








