నవంబర్ 27, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'ఐ హేట్ మ్యారేజ్'. దయానంద్ మదం, కార్తీక్ వెంపటి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వం వహించారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, విజయ్ C కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.

ఈ సినిమాలో జాహ్నవిగా జుప్సి భద్ర, మీనాక్షిగా హారిక రాజేందర్, భారతిగా సాహితి కృష్ణ ఒక లేడీస్ హాస్టల్‌లో ఉంటారు. మీనాక్షి ఉద్యోగం చేస్తూ ఎవరు ప్రపోజ్ చేసినా పెళ్లి వద్దు అంటుంది. భారతి పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం మోసపోయి ప్రయత్నాలు చేస్తుంటుంది. జాహ్నవికి రొమాన్స్ చేయాలని ఉన్నా, పెళ్లి మాత్రం తండ్రి (రవివర్మ) చూపించిన అబ్బాయినే చేసుకుంటానని మాట ఇస్తుంది.

పెళ్లికి ముందు ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా తిరిగే అబ్బాయి కోసం వెతికే జాహ్నవికి, డైరెక్టర్ కావాలనుకునే రామ్ (సుగి విజయ్) దొరుకుతాడు. పృథ్వీరాజ్ లేడీస్ హాస్టల్ వాచ్‌మెన్‌గా నటించి నవ్విచడానికి ప్రయత్నించారు. రొటీన్ కథాంశంతో సాగే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్, రియాలిటీలో జరిగే జాబ్ మోసాలను చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, రామ్ - జాహ్నవి మధ్య కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ రామ్, జాహ్నవి ప్రేమ, ఎమోషన్స్‌తో నడుస్తుంది. అయితే క్లైమాక్స్‌లో సరైన ముగింపు లేకుండానే నడిపించారని, సమాజంలో మారుతున్న అమ్మాయిల తీరును చూపించడానికే ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే సుగి విజయ్, హారిక రాజేందర్, సాహితి కృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.