2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన 'శంభో శివ శంభో' చిత్రాన్ని మేకర్స్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్నేహితుడి ప్రేమ కోసం ముగ్గురు స్నేహితులు చేసిన త్యాగం, వారు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాగుతుంది.
సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ, అల్లరి నరేశ్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. రవితేజ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించి మెప్పించింది. స్నేహం విలువను చాటిచెప్పే ఈ చిత్రాన్ని ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఈ రీ రిలీజ్ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసింది. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది.








