రష్మిక మందన్నా, షాహిద్ కపూర్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం 'కాక్‌టెయిల్-2' త్వరలో డిజిటల్ తెరపైకి రానుంది. ఈ సినిమాలో కృతి సనన్ మరో హీరోయిన్‌గా నటించగా, హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఆగస్టు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా దీనిని రూపొందించారు.
2012లో విడుదలైన 'కాక్‌టెయిల్' చిత్రానికి ఇది సీక్వెల్. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాకు కొనసాగింపుగా ఈ కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.








